రేపు జలుమూరులో విద్యుత్ సరఫరాకు అంతరాయం

64చూసినవారు
రేపు జలుమూరులో విద్యుత్ సరఫరాకు అంతరాయం
జలుమూరు మండలంలో ఈనెల 1వ తేదీన అనగా సోమవారం విద్యుత్ సరఫరాను నిలిపివేయడం జరుగుతుందని విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ. జలుమూరు మండలం తిమడాం వద్ద 11 కె. వీ పీడర్‌ను అధిక లోడ్ ఉన్న కారణంగా వాటిని వేరు చేస్తున్నామన్నారు. ఈ క్రమంలో అచ్చుతాపురం, కరకవలస, బైదలాపురం, శ్రీముఖలింగం, తిమడాం, పర్లాం ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్నామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్