మురుగుతో అవస్థలు.. కానరాని అధికారులు

50చూసినవారు
నరసన్నపేట పట్టణంలోని మారుతీనగర్ రెండో వీధిలో ఆవాసాల మధ్య మురుగు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలువలు నిర్మించక పోవడంతో పరిస్థితి ఇలా మారిందని స్థానికవాసులు తెలిపారు. దీనిపై ఎన్నోసార్లు అధికారులకు మొరపెట్టుకుంటున్నా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్