నరసన్నపేట మండలం జమ్మూ గ్రామంలో నందలబావి శుభ్రపరిచేందుకు వెళ్లిన కార్మికుడు గాయపడిన ఘటన జరిగింది. జమ్మూ గ్రామంలో బొరిగివలస గ్రామానికి చెందిన కోణంగి అప్పన్న నంద బావిని శుభ్రపరిచేందుకు బుధవారం మధ్యాహ్నం సిద్ధమయ్యాడు. అయితే లోపలకి వెళ్ళిన తర్వాత మట్టి, నందల లోపలికి పడిపోవడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లి బాధితుడిని ప్రాణాలతో కాపాడారు.