పోలాకి రహదారిలో ట్రాఫిక్ జామ్.. అవస్థలు పడ్డ వాహన చోదకులు

82చూసినవారు
నరసన్నపేట మండలం పోలాకి రహదారిలో సుమారు రెండు గంటలకు పైగా ట్రాఫిక్ జామ్ అయింది. మంగళవారం స్థానికంగా ఉన్న ఒక కళ్యాణ మండపం వద్ద వాహనాలు ఎక్కువగా నిలిచిపోవడంతో ఈ పరిస్థితి ఎదురైంది. దీనిపై స్థానికుల సైతం దిక్కుతోచని స్థితిలో గంటలు తరబడి వేచి ఉండే పరిస్థితి నెలకొంది. చిన్నారులు మహిళలతో పాటు పలువురు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయితే దీనిపై పోలీసులకు సమాచార లేకపోవడంతో సమస్య మరింత జటిలంగా మారింది.

సంబంధిత పోస్ట్