వేతనాలు చెల్లింపులు అలసత్వం వద్దు: డ్వామా పిడి చిట్టి రాజు

72చూసినవారు
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఉపాధి వేతన దారులకు వేతనాల చెల్లింపులు అలసత్వం వద్దని డ్వామా జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ జివి చిట్టి రాజు ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం నరసన్నపేట మండల కేంద్రంలోని స్థానిక ఉపాధి కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వారం వేతనదారులకు వేతనాలు జమ చేయాలని అన్నారు. ఎటువంటి అవకతవకలు ఉన్న చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.