రానున్న సార్వత్రిక ఎన్నికలలో ఉమ్మడి పార్టీల అభ్యర్థులను గెలిపించాలని నరసన్నపేట నియోజకవర్గ అభ్యర్థి బగ్గు రమణమూర్తి పిలుపునిచ్చారు. బుధవారం ఉదయం నరసన్నపేట మండల కేంద్రంలోని గాంధీ నగర్ తో పాటు పలు విధులలో పార్టీ ప్రచారాన్ని కార్యకర్తలతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు తెలియజేశారు. అభివృద్ధి సాధించాలంటే తెలుగుదేశం పార్టీతోనే అది సాధ్యమవుతుందని అన్నారు.