అన్నదాన పథకానికి రూ. లక్ష విరాళం

74చూసినవారు
అన్నదాన పథకానికి రూ. లక్ష విరాళం
పవిత్ర పుణ్య క్షేత్రం అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని గురువారం శ్రీకాకుళం వాస్తవ్యులు కెకె విశ్వేశ్వరరావు దర్శించుకున్నారు. వారి మనవడు అందే సూర్య సుధీర్ కార్తికేయ పేరు మీద శాశ్వత అన్నదానం పథకం నిమిత్తం రూ. 1, 00, 000లు ఆలయ ఈవోకి చెక్కు రూపంలో అందజేశారు. ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. వారికి శ్రీ స్వామి వారి జ్ఞాపికను ఆలయ ఈవో ఎస్. చంద్రశేఖర్ అందజేశారు.

సంబంధిత పోస్ట్