ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య: ఎంఈఓ వై. దుర్గారావు

73చూసినవారు
ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య: ఎంఈఓ వై. దుర్గారావు
జడ్పీహెచ్ఎస్ అరసాడ పాఠశాల విద్యార్థులు ఎంఈఓ-2 వై. దుర్గారావు ఆధ్వర్యంలో నేను బడికి పోతా అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య అందిస్తుందని ఎంఈఓ అన్నారు. మన ఊరు బడి - భవితకు గుడి, పెద్దలు పనికి - పిల్లలు బడికి వంటి పలు నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కే జగదీశ్వరి, ఎం గోవిందరావు, సిఆర్ఎంటి ఎం. గణపతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.