శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ పరిధిలో నిర్వహిస్తున్న అనుబంధ డిగ్రీ కళాశాలలకు డిగ్రీ 2వ సెమిస్టర్, 4వ సెమిస్టర్ ప్రాక్టికల్ పరీక్షలు శుక్రవారం నుండి ప్రారంభం కానున్నట్లు ఎగ్జామినేషన్ డీన్ ఉదయభాస్కర్ వెల్లడించారు. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్ ను కూడా విడుదల చేస్తామని తెలిపారు. ఈ విషయాన్ని విద్యార్థులు గమనించాలని ఆయన కోరారు.