కోటబొమ్మళి మండలం వాండ్రాడ గ్రామ సమీప జాతీయ రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రహదారి దాటుతున్న గొర్రెల మందను అతివేగంగా వచ్చిన కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో 6 గొర్రెలు అక్కడికక్కడే మృతిచెందగా. 4 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. విషయం తెలుసుకున్న పోలీసులు, నేషనల్ హైవే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు.