జాతీయ లోక్ అదాలత్ పై సమీక్ష సమావేశం

55చూసినవారు
కోటబొమ్మాలి మండల కేంద్రంలోని కోర్టులో మండల న్యాయ సేవాసంఘం అధ్యక్షులు, జూనియర్ సివిల్ జడ్జి బి ఎం ఆర్ ప్రసన్న లత బుధవారం మే 11న జరగనున్న జాతీయ లోక్ అదాలత్ పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎక్కువ సంఖ్యలో కేసులు రాజీ పడేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో నౌపడ ఎస్సై పి. కిషోర్ వర్మ, ఎస్ ఈ బి ఇన్స్పెక్టర్ కుమార్, కోటబొమ్మాలి సంతబొమ్మాలి, నౌపడ, జలుమూరు పోలీసులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్