విశాఖ జిల్లా ఎండాడ వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డుప్రమాదంలో బూర్జ మం. ఉప్పినవలసకు చెందిన నంబాల వెంకటరమణమూర్తి (45) అనే వ్యక్తి మృతిచెందాడు. శ్రీకాకుళం నుంచి ద్విచక్రవాహనంపై వస్తుండగా, మహిళా పోలీస్ స్టేషన్ ఎదురుగా ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఆయన బస్సు చక్రాల కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. వెనక ఉన్న వెంకట్రావు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. డ్రైవర్ బలరాంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.