ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధిలోని షుగర్ ఫ్యాక్టరీ జంక్షన్ లో కొలువై ఉన్న శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవాలయంలో శుక్రవారం శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆవర్చన కార్యక్రమం జరిగింది. ఆలయ ప్రధాన అర్చకులు బంకుపల్లి దుర్గా శ్రీనివాసశర్మ, జాడ సతీష్ శర్మ ఆధ్వర్యంలో విశాఖ నుంచి వచ్చిన భక్తులతో ఈ పూజలు నిర్వహించారు. సుబ్రహ్మణ్యస్వామి అర్చన వల్ల ఎన్నో శుభ కార్యక్రమాలు జరుగుతాయని అర్చకులు దుర్గా శ్రీనివాస్ శర్మ తెలిపారు.