ఆమదాలవలసలోని మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్ పాలన నాయకత్వంపై రెండు రోజుల శిక్షణ కార్యక్రమం సెల్ఫ్-డీఆర్డీఏ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్బంగా వెలుగు పీవో జి. నారాయణరావు సమాఖ్య పాలకవర్గ కార్యవర్గ సభ్యులకు, కమ్యూనిటీ కో ఆర్డినేటర్లకు పాలన నాయకత్వంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వెలుగు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.