మరుగున పడుతున్న కళలను వెలుగులోకి తీసుకురావాల్సిన బాధ్యత మనందరిపై ఉందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆదివారం రాత్రి ఆముదాలవలస గ్రామదేవత పాలపోలమ్మ ఆలయ ప్రాంగణంలో ఉభయ తెలుగు రాష్ట్రాల నాటిక పోటీలు -2025 సందర్భంగా పోటీలు మూడో రోజు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ కళాకారులను రక్షించుకోవలసిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి కృపారాణి, ఎమ్మెల్యే కూన ఉన్నారు.