ప్రభుత్వ ఆధీనంలో నిర్వహిస్తున్న అంగన్వాడి కేంద్రాలు మరింత మెరుగు పడవలసిన అవసరం ఉందని ఎమ్మెల్యే కూన రవికుమార్ తెలిపారు. శనివారం ఆమదాలవలస జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఉన్న అంగన్వాడి కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. ఈ క్రమంలో చిన్నారులతో కాసేపు ముచ్చటించారు. వారికి అందిస్తున్న పౌష్టిక ఆహారం తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. మరిన్ని సేవలు చిన్నారులకు అందించాలన్నారు.