ఆమదాలవలసలో జనసేన సీనియర్ నేత పాత్రుని. పాపారావు కుమారుడు అశోక్ వర్ధన్ గుండె సంబంధిత వ్యాధితో ఇటీవల మరణించారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వారి కుటుంబ సభ్యులను శనివారం పరామర్శించారు. అనంతరం అతని మృతికి గల కారణాలు అడిగి తెలుసుకుని, తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు.