ఆమదాలవలస పట్టణంలోనీ కొత్త కోట వారి వీధిలో సీసీ రోడ్లు, డ్రెయిన్ల పనులకు శనివారం శంఖుస్థాపన చేశారు. కొత్త కోట వారి వీధిలో 200మీటర్ల సీసీ రోడ్లు, డ్రైన్ లకు అలాగే కొత్త కోట వారి వీధి నుండి ఎమ్మార్వో ఆఫీసు వరకు డ్రెయిన్ల నిర్మాణం చేస్తున్నట్లు మున్సిపల్ మాజీ చైర్మన్ గీత విద్యాసాగర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మొదలవలస రమేష్, పైలా మురళీధర్, బీవీ రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.