ఆమదాలవలస మండలం తమ్మయ్య పేట గ్రామానికి చెందిన వైసిపి సీనియర్ నాయకుడు కోట గోవిందరావు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారామును తన నివాసంలో శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. కోట గోవిందరావును వైసీపీ అధికార ప్రతినిధిగా పార్టీ అధిష్టానం నియమించింది. ఆ మేరకు ఆయన మాజీ స్పీకర్ తమ్మినేని సీతారామును కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి తన వంతుగా కృషి చేస్తానని కోట గోవిందరావు తెలిపారు.