ఐసీడిఎస్ సీడీపీఓ ఆధ్వర్యంలో బూర్జ మండలం లక్కుపురం అంగన్వాడీ
కేంద్రంలో పర్యవేక్షకురాలు పి. రత్నం బుధవారం పోషణ్ పక్వాడ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు గర్భిణీ, బాలింతలు, చిన్నారులకు పోషకాహారంపై సలహాలు, సూచనలు చేశారు. వ్యాక్సినేషన్ షెడ్యూల్ను వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు కాశీ విశ్వేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.