ఆమదాలవలస పట్టణంలో శ్రీ పాలపోలమ్మ తల్లి ఆలయం ఆవరణలో ఉభయ తెలుగు రాష్ట్రాల నాటిక పోటీలను ఎమ్మెల్యే కూన రవికుమార్ శుక్రవారం ప్రారంభించారు. నాటికల వలన సమాజంలో ఉన్న లోపాలను సరిచేసేందుకు దిక్సూచిగా మారుతుందన్నారు. ఇటువంటి పోటీలను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని అన్నారు. కళాకారులను ప్రతి ఒక్కరూ గౌరవించాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహక కమిటీ సభ్యులు పాల్గొన్నారు.