ఆమదాలవలస: 'సంక్షేమ పాలన అంటే వారికి సరైన అర్థం తెలిదు'

77చూసినవారు
ఆమదాలవలస: 'సంక్షేమ పాలన అంటే వారికి సరైన అర్థం తెలిదు'
ఆమదాలవలస మండల కేంద్రంలోని టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ  కార్యక్రమంలో పాల్గొన్న ఆమదాలవలస నియోజకవర్గం ఎమ్మెల్యే కూన రవికుమార్ అనంతరం మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి తీసుకువస్తున్న పెట్టుబడులతో నిరుద్యోగ యువతకు కల్పిస్తున్న ఉద్యోగ అవకాశాలను వివరించారు. వైసీపీ నాయకులకు ప్రజా సంక్షేమ పరిపాలన అంటే సరైన అర్థం తెలియదంటూ విమర్శలు గుప్పించారు.

సంబంధిత పోస్ట్