రహదారి అద్వాన్నంపై ఫిర్యాదులు రావడంతో మున్సిపల్ కమిషనర్ పూజారి బాలాజీ ప్రసాద్ పరిశీలించారు. ఆముదాలవలస మునిసిపాలిటీ పరిధిలోని 13వ వార్డు సాయి నగర్ రహదారిపై వర్షం పడితే నిలవ ఉండడంతో స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కమిషనర్ కు ఫిర్యాదు అందడంతో రహదారిని పరిశీలించారు. గోతులు అధికంగా ఉండడంతో వర్షం పడితే నీరు నిలవ ఉంటుందని త్వరలో రహదారి నిర్మాణం పనులు త్వరలో చేపడతామని కమిషనర్ స్థానికులకు హామీ ఇచ్చారు.