ఆముదాలవలస: రైతులకు రాయితీపై వ్యవసాయ యంత్రాలు పంపిణీ

58చూసినవారు
ఆముదాలవలస కృషి విజ్ఞాన్ కేంద్రంలో శుక్రవారం ఉదయం రైతులకు రాయితీపై వ్యవసాయ యంత్రాల పరికరాల పంపిణీ కార్యక్రమాన్ని ఆమదాలవలస నియోజకవర్గంలో ఎమ్మెల్యే, రాష్ట్ర పియుసి చైర్మన్ కూన రవికుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని సామాజిక వర్గాలకు, చేతి వృత్తుల వారికి, రైతులకు గతంలో టీడీపీ అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు, స్థానిక పార్టీ నేతలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్