ఆముదాలవలస మండలంలో లోద్దల పేటలో వెలసి యున్న శ్రీశ్రీశ్రీ కాశీ విశ్వేశ్వర 16వ కళ్యాణ మహోత్సవం శనివారం ఘనంగా జరుపుబడును అని ఆలయ ధర్మకర్త బొడ్డేపల్లి ఈశ్వరరావు, మహతి దంపతులు తెలిపారు. లోద్దల పేట, బెలమాo, గండ్రేడు, వెంకంపేట, తాడివలస గ్రామస్తులందరూ ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా, అలాగే అన్న ప్రసాదాన్ని స్వీకరించవలసినదిగా తెలియజేశారు.