ఆముదాలవలస పట్టణంలో గల లక్ష్మీ నగర్ ప్రభుత్వ మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో ఆల్ పెన్షనర్స్, రిటైర్డ్ పెన్షనర్స్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం ఎస్ సిమ్మి నాయుడు అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు. ప్రభుత్వం 12వ పిఆర్సి ప్రకటించి, వి ఆర్ 30 శాతం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యదర్శి బి జనార్దనరావు, కోశాధికారి హెచ్ వి సత్యనారాయణ, కార్యవర్గ సభ్యులు, విశ్రాంతి ఉపాధ్యాయులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.