ఆముదాలవలస: కళా ప్రదర్శనతో సమాజంలో చైతన్యం సాధ్యపడుతుంది

1చూసినవారు
ఆముదాలవలస: కళా ప్రదర్శనతో సమాజంలో చైతన్యం సాధ్యపడుతుంది
ఆముదాలవలస మున్సిపాలిటీ లక్ష్మీ నగర్ ప్రభుత్వ పాఠశాల లో పి ధనుంజయ రావు అధ్యక్షతన ఆమదాలవలస కళాకారుల సంక్షేమ సంఘం కార్యవర్గ సమావేశం ఆదివారం నిర్వహించారు. కళా ప్రదర్శనలతో సమాజంలో చైతన్యం సాధ్యపడుతుందని సహాధ్యక్షులు బి. జనార్దన్ రావు అన్నారు. కళలను ఆదరించాలని, కళాకారులను ప్రభుత్వాలు ప్రోత్సహించాలని సంఘం ప్రధాన కార్యదర్శి బి తేజశ్వరరావు పేర్కొన్నారు. ఈ సమావేశంలో కళాకారుల సంఘం ప్రతినిధులు, కళాకారులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్