ఆముదాలవలస జూనియర్ సివిల్ కోర్టులో శనివారం లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జ్ బి. రమ్య మాట్లాడుతూ, ఇరు వర్గాల సమ్మతితో కేసులను పరిష్కరించే ఉత్తమ మార్గం లోక్ అదాలత్ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బార్ కౌన్సిల్ అధ్యక్షుడు ఏ. సత్యనారాయణ, న్యాయవాదులు, కక్షిదారులు తదితరులు పాల్గొన్నారు.