ఆముదాలవలస: ప్రతి పేదవాడికి వైద్యం అందాలి

79చూసినవారు
ఆముదాలవలస: ప్రతి పేదవాడికి వైద్యం అందాలి
ఆముదాలవలసకు చెందిన టీడీపీ నాయకుడు డా. చాపర సుధాకర్‌ను ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడిగా రాష్ట్ర ప్రభుత్వం శనివారం నియమించింది. ఈ సందర్భంగా ఆదివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్, ఎమ్మెల్యే కూన రవికుమార్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వైద్యం ప్రతి పేదవాడికి అందాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు.

సంబంధిత పోస్ట్