పర్యావరణానికి మొక్కలు నాటాలని ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ కోరారు. శుక్రవారం ఆముదాలవలస ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు మొక్కలు దోహద పడతాయని ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలు,టిడిపి నాయకులు తమ్మినేని గీతా విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.