ఆముదాలవలస: ప్రభుత్వసంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అమలు దృష్టి: ఎమ్మెల్యే

63చూసినవారు
ఆముదాలవలస మండల ప్రజాపరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పియుసి చైర్మన్ కూన రవికుమార్ ఈ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఇళ్ల స్థలాలు వాటికి సంబంధించిన పొజిషన్ సర్టిఫికెట్లు తదితర అంశాలపై రెవిన్యూ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు, మండల అభివృద్ధి పనులు క్షేత్రస్థాయిలో అమలు జరుగుతున్న తీరుపై సమీక్షించారు.

సంబంధిత పోస్ట్