ఆముదాలవలస మున్సిపల్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్, పెండింగ్ బకాయిల వసూళ్లు తదితర అంశాలపై బుధవారం సమావేశం జరిగింది. రీజనల్ డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ విశాఖపట్నం వారు, కమిషనర్ పి బాలాజీ ప్రసాద్ ఆధ్వర్యంలో వార్డు ప్లానింగ్ సెక్రటరీలతో ఈ సమావేశం నిర్వహించారు. లేఅవుట్ రెగ్యులైజేషన్ కాకుండా పెండింగ్ లో ఉన్న దరఖాస్తులపై వెంటనే తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. అనుమతులు పొందిన తర్వాతే భవన నిర్మాణాలు జరగాలన్నారు.