చిన్న చిన్న ఉద్యోగులను తొలగిస్తూ టిడిపి నాయకులు నియోజకవర్గంలో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆముదాలవలస వైసిపి నియోజకవర్గ ఇన్ ఛార్జ్ చింతాడ రవికుమార్ ఆరోపించారు. శనివారం ఆముదాలవలసలో వైసీపీ నియోజకవర్గ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిడిపికి ఓటు వేయలేదని కారణం చూపి నియోజకవర్గంలో చిన్న చిన్న ఉద్యోగులను తొలగిస్తూ ఆనంద పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.