ఆముదాలవలస మున్సిపాలిటీ పరిధి కొత్త కoడ్రపేటలో గల జగన్నాథ స్వామి ఆలయంలో శనివారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీకృష్ణ తులసి మత్స్యకారుల సంఘం ఆధ్వర్యంలో మారు దశమి సందర్భంగా సాయంత్రం జగన్నాథ స్వామి రథయాత్రను ఆమదాలవలస పట్టణంలో నిర్వహించినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. స్వామివారి రథోత్సవం జై జగన్నాథ జై జగన్నాథ అంటూ నినాదాలు చేస్తూ రథోత్సవం నిర్వహించారు. కమిటీ సభ్యులు లక్ష్మణ కృష్ణ పాల్గొన్నారు.