మహాత్మ జ్యోతి బాపులే సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న ఆహారంపై ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆముదాలవలస శాసనసభ్యులు కూన రవికుమార్ పట్టణంలోని జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు సదరు కాంట్రాక్టు అందిస్తున్న ఆహారాన్ని 44 రూపాయలకే అందివ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు అందుతున్న వసతుల కల్పన పైన ఆరా తీశారు.