కోర్టు తీర్పుతో స్థలాలు కోల్పోయిన వారిని ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆదుకున్నారు. ఆముదాలవలస మండలం జొన్నవలస గ్రామానికి చెందిన 15 మంది చెరువులో ఇంటి స్థలాలను ఆక్రమించి ఇల్లు నిర్మించారని న్యాయస్థానం తీర్పుతో రెవిన్యూ అధికారులు వీరి ఇల్లను కూలదీశారు. దీంతో శనివారం టిడిపి కార్యాలయంలో 15 మందికి మూడు సెంట్ల ఇంటి నిర్మాణానికి పట్టాలను అందజేశారు.