విజయవాడలోని మంగళగిరి తెదేపా ప్రధాన కార్యాలయంలో సెమినార్ కార్యక్రమం మంగళవారం జరిగినది. ముఖ్య అతిథిగా ఆముదాలవలస శాసనసభ్యులు, రాష్ట్ర పియుసి చైర్మన్ కూన రవికుమార్ హాజరు అయ్యారు. ఈ సందర్భంగా తెదేపాలోని పలు విభాగాలకు చెందిన నాయకులకు ఎలా ప్రజల మన్ననలు పొందాలి, ఆదర్శ నాయకుడుగా ఎలా ఉండాలి, ప్రజా సమస్యలు పైన ఎలా పోరాడాలి, అన్ని శాఖలు పైన విషయ పరిజ్ఞానం ఎలా పెంచుకోవాలి అనే పలు విషయాలు పైన మాట్లాడారు.