ఆముదాలవలస పరిధిలో మంగళవారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన కురిసింది. ఆకాశమంతా మేఘావృతమై చల్లని గాలులు వీస్తూ వర్షం కురవడంతో వాతావరణం ఒక్కసారిగా ఆహ్లాదకరంగా మారింది. ప్రజలు ఎవరూ బయట తిరగవద్దని జిల్లాస్థాయి అధికారులు సూచించారు. ఖరీఫ్ పంటలు సిద్ధమవుతున్న రైతులకు ఈ వర్షం ఉపయోగపడుతుందని అన్నారు. అలాగే నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న నాలుగు మండలాల్లో వర్షం పడడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.