ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ను శుక్రవారం ఆముదాలవలస పెన్షనర్ల సంఘం సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం ఇచ్చినట్లు సంఘం అధ్యక్షులు ఎస్ సిమ్మి నాయుడు తెలిపారు. పెన్షనర్ల సంఘం సామాజిక భవనం నిర్మాణానికి స్థలం కేటాయించాలని కోరారు. పెన్షనర్ల సమస్యలు వివరించారు. ప్రధాన కార్యదర్శి జనార్దన్ రావు, ట్రెజరర్ హెచ్ వి సత్యనారాయణ, మాజీ ఎమ్మార్వో రామారావు, సభ్యులు పాల్గొన్నారు