ఆముదాలవలస పట్టణంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం పలువురు మహిళలు సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. దేవాలయ 95 వ వార్షికోత్సవం సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు గోపినంబాల కృష్ణ చైతన్య స్వామి, సంతోష్ ఆలయ కార్యనిర్వహణ అధికారి తమ్మినేని రవి తెలిపారు. వేద మంత్రోత్సారణ నడుమ నిర్వహించిన పూజా కార్యక్రమంలో పట్టణ పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పాల్గొన్నారు.