ఏపీ పీయూసీ చైర్మన్ గా ఎమ్మెల్యే కూన రవికుమార్ నియామకంపై ఆముదాలవలస మండల టీడీపీ అధ్యక్షులు నూక అప్పల సూరన్నాయుడు రాజు హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన వ్యవస్థలో మూడు ఫైనాన్సియల్ కమిటీల నియామకపు ఉత్తర్వులు జారీ చేశారు. అందులో భాగంగా ఆముదాలవలస శాసనసభ్యులు కూన రవికుమార్ కి ప్రభుత్వ రంగ సంస్థల సమితి పియుసి చైర్మన్ గా ఏపీ ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే.