అహ్మదాబాద్ లో గురువారం జరిగిన విమాన ప్రమాదంలో మృతి చెందిన వారికి ఆముదాలవలస నియోజకవర్గ ఎమ్మెల్యే కూన రవికుమార్ శుక్రవారం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆముదాలవలస టీడీపీ కార్యాలయం వద్ద ఆయన మాట్లాడుతూ విమానం మెడికల్ కాలేజీ హాస్టల్ పై కూలిపోవడంతో వైద్య విద్యార్థులు కూడా మృత్యువాత పడడం, గాయాల పాలు అవడం తీవ్రంగా కలచివేసిందని అన్నారు. బాధితుల కుటుంబాలను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.