కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రజలే తిప్పికొడతారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. శనివారం ఆముదాలవలస పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవలే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వివిధ హోదాలలో కార్యవర్గ సభ్యులను జిల్లా, మండల స్థాయి, అనుబంధ సంఘాలలో నియమించిన విషయం తెలిసిందే. నియమితులైన నూతన కార్యవర్గ సభ్యులను అభినందనలు తెలిపారు.