ఆముదాలవలస మండలం శ్రీహరిపురం గ్రామంలో శుక్రవారం కళింగ సంఘం నేత, రిటైర్డ్ ఎమ్మార్వో, స్థానిక టీడీపీ నాయకులు పేడాడ జనార్దన్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. గత వైసీపీ హయాంలో తెల్ల రేషన్ కార్డు బియ్యం కుంభకోణం జరిగిందని ఆరోపించారు. వైసీపీ కంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొత్తగా తెల్ల రేషన్ కార్డులు ఇచ్చేందుకు ఉపక్రమించిందని కొనియాడారు.