ఆముదాలవలస పట్టణంలో ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు ఆపరేషన్ సింధూర్ లో అమరులైన సైనికులకు జోహార్లు అర్పించుటకు, భారతదేశ సమగ్రతను కాపాడుకుంటూ త్రివిధ దళాలు శౌర్యం, ధైర్యం, త్యాగాలను గౌరవించుటకు ఆమదాలవలస మున్సిపాలిటీ కండ్రపేట వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం నుండి కృష్ణాపురం జంక్షన్ వరకు, కృష్ణాపురం జంక్షన్ నుండి గాంధీ విగ్రహం వరకు తిరంగా యాత్ర జరుగును. ఈ తిరంగా యాత్రలో శాసనసభ్యలు కూన రవి కుమార్ పాల్గొనున్నారు. అధిక సంఖ్యలో పాల్గొనవలసినదిగా ఎమ్మెల్యే కార్యాలయం నుండి శుక్రవారం ప్రకటన విడుదల.