ఆముదాలవలస పశు వైద్యశాల సహాయ సంచాలకులు డా. రోణంకి ఆనందరావు కు సరుబుజ్జిలి బదిలీ అయింది. కొత్తూరు నుంచి ఆమదాలవలస పశువైద్యశాలకు డా. జి నారాయణరావు బదిలీపై వచ్చి శుక్రవారం విధుల్లో చేరారు. అలాగే సరుబుజ్జిలి డా. సిహెచ్ సుబ్రహ్మణ్యం కు విజయనగరం జిల్లా చీపురుపల్లి కి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.