ఆముదాలవలస పశువుల ఆసుపత్రి వద్ద ప్రపంచ జోనోసిస్ దినోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. అలాగే 50 శాతం సబ్సిడీపై పాడి రైతులకు పశువుల దాణా పంపిణీ చేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆముదాలవలస నియోజకవర్గ ఎమ్మెల్యే కూన రవికుమార్ పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న పశువుల వ్యాక్సినేషన్, పశువుల దాణా పంపిణీ ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. స్థానిక నాయకులు, వైద్య సిబ్బంది, పాడి రైతులు పాల్గొన్నారు.