చింతాడలో వ్యవసాయ అధికారులు యంత్ర పరికరాలు తనిఖీ

66చూసినవారు
చింతాడలో వ్యవసాయ అధికారులు యంత్ర పరికరాలు తనిఖీ
చింతాడలో వ్యవసాయ అధికారులు యంత్ర పరికరాలను తనిఖీ చేశారు. ఆముదాలవలస మున్సిపాలిటీ పరిధి చింతాడ గ్రామంలో శుక్రవారం శ్రీకాకుళం మండల వ్యవసాయ అధికారి ఎం. ఉషా కుమారి సందర్శించారు. కమ్యూనిటీ హైరింగ్ కేంద్రం, శ్రీరామ రైతు మిత్ర గ్రూప్ వ్యవసాయ యంత్రాలను తనిఖీలు చేపట్టారు. యంత్ర పరికరాల పూర్తి ఖరీదు, ప్రభుత్వం అందించిన రాయితీ, గ్రూపు చెల్లించిన మొత్తం సొమ్ము, బ్యాంకు ఆమోదించిన లోన్ తదితర వివరాలను పరిశీలించారు.

సంబంధిత పోస్ట్