ఆమదాలవలస పట్టణంలోని 33/11 కె. వి సబ్ స్టేషన్ పరిధిలో 11 కెవి మెట్టక్కివలస టౌన్- 2 ఫీడర్ పరిధిలో మరమ్మతులు, చెట్టు కొమ్మలు తొలగించుట కారణంగా శుక్రవారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్టు ఈఈ పైడి యోగేశ్వరరావు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మెట్టక్కివలస, అమ్మానగర్, కుప్పిలివారి వీధి, ఊసవానిపేట, అలమాజీపేట, వాటర్ పంపు తదితర ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడునని తెలిపారు.