ఆమదాలవలస: రైలు ఢీకొని వ్యక్తి మృతి

57చూసినవారు
ఆమదాలవలస: రైలు ఢీకొని వ్యక్తి మృతి
ఆమదాలవలస రైల్వేస్టేషన్ పరిధిలోని వెంగళరావు కాలనీ సమీపంలో అప్ లైన్ ట్రాక్పై మంగళవారం రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. జిఆర్పి ఎస్ఐ మధుసూదనరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బూర్జ మండలం పాలవలసకు చెందిన సురవరపు శ్రీనివాసరావు (42) వ్యక్తిగత పనులపై వెళ్తూ ట్రాక్ దాటుతున్నాడు. ఈ సమయంలో గుర్తు తెలియని రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్